Ind vs Aus: లంచ్ బ్రేక్ కి ఆస్ట్రేలియా 104/5 27 d ago
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తున్నది. ఆతిథ్య జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమ్‌ఇండియా, ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ కుడా సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ట్రావిస్ హెడ్ 73 బాల్స్‌లో 63 రన్స్ చేశాడు. ప్రస్తుతం హెడ్‌తోపాటు మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నాడు. భారత్ గెలుపుకు ఇంకా 5 వికెట్లు తీయాల్సి ఉంది.